30.7.26

హరిత రసాయన పరిశోధనలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం : ప్రముఖ శాస్త్రవేత్తల పిలుపు ENVIRONMENT




తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల (అటానమస్) రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "పర్యావరణ పరిరక్షణకు దోహదపడే స్థిరమైన రసాయన సమ్మేళనాల తయారీ (SCSREI)" అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ రసాయన శాస్త్ర సదస్సు బుధవారం కళాశాల సమావేశ మందిరంలో వైభవంగా ప్రారంభమైంది.

కళాశాల ప్రిన్సిపాల్ డా. వేణుగోపాల్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ సిపిఆర్వో డా. టి. రవి, ఎస్.పీ.డబ్ల్యూ. డిగ్రీ & పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. నారాయణమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిపిఆర్వో డా. టి.రవి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ నేటి ప్రపంచానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. హరిత రసాయన శాస్త్ర పరిశోధనలు ప్రకృతి వనరుల సంరక్షణతో పాటు కాలుష్య నియంత్రణకు సమర్థవంతమైన మార్గాలని తెలిపారు. విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే దిశగా మలచాల్సిన బాధ్యత యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులపై ఉందన్నారు. విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే దిశగా మలచాల్సిన బాధ్యత యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులపై ఉందన్నారు. పర్యావరణ హిత సాంకేతికతలను అభివృద్ధి చేస్తూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, సుస్థిరమైన ప్రపంచాన్ని అందించేందుకు విద్యార్థులు పరిశోధనా రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. విద్య, విజ్ఞానం, విలువలు సమన్వయంతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వివ‌రించారు.

పర్యావరణహిత ఔషధ తయారీపై కీలకోపన్యాసం

ఢిల్లీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డా. పన్నూరు వెంకటేశు "ఔషధ తయారీలో పర్యావరణహిత ద్రావకాల వినియోగం – ఔషధ సూత్రీకరణల్లో అయానిక్ ద్రవాలు, డీప్ యూటెక్టిక్ ద్రావకాల ప్రాధాన్యం" అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఔషధ తయారీలో పర్యావరణహిత ద్రావకాల వినియోగం వల్ల ఔషధాల ద్రావణీయత, స్థిరత్వం, జీవలభ్యత పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా విశేషంగా దోహదపడుతుందని ఆయన వివరించారు.

ఆధునిక పరిశోధనా ధోరణులపై నిపుణుల విశ్లేషణ

అనంతరం ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ డా. రమేష్ గురుదాస్, ఐఐటీ తిరుపతికి చెందిన కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డా. సునీల్ కుమార్, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన రసాయన శాస్త్ర ప్రొఫెసర్ డా. ఏ. రాజ్ కుమార్ ఉపన్యాసాలు అందించి రసాయన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలు, ఆధునిక పరిశోధనా దిశలు, పారిశ్రామిక అనువర్తనాలు, హరిత సాంకేతికతలపై సమగ్రంగా వివరించారు.

దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు చెందిన పరిశోధక విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను మౌఖికంగా సమర్పించి శాస్త్రీయ చర్చల్లో పాల్గొన్నారు.

రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. పి.వి. చలపతి కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ జాతీయ సదస్సులో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ANKURARPANAM PERFORMED FOR SRI PRASANNA VENKATESWARA SWAMY PUSHPA YAGAM


The Ankurarpanam ritual for the annual Pushpa yagam of Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta was performed as per Agama traditions on Wednesday evening. The Pushpayagam will be held on July 30.

Earlier in the day, Acharya Ritwik Varanam was conducted. In the evening, Medini Puja, Senadhipati Utsavam and Ankurarpanam were performed.

On Thursday, July 30, Snapana Tirumanjanam to the Utsava deities of Sri Prasanna Venkateswara Swamy along with Sridevi and Bhudevi will be held from 11 am to 12 noon. Pushpa yagam will be performed from 3 pm to 5.30 pm. Later, from 6.30 pm to 7.30 pm, the Lord and His Consorts will bless devotees in a Tiruchi procession through the four Mada Streets.

Temple AEO Devarajulu, Chief Priest Suryakumaracharyulu, Superintendent Srivani, Temple Inspector Venugopal and others participated in the rituals.

శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామి వారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ ankurarpanam



అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జులై 30 తేదీన జ‌రుగ‌నున్న పుష్పయాగానికి బుధ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.

ఉద‌యం ఆచార్య ఋత్విక్‌వ‌ర‌ణం జ‌రిగింది. సాయంత్రం 6.30 నుండి అంకురార్పణం నిర్వహించారు ఇందులో భాగంగా మేదినిపూజ‌, సేనాధిప‌తి ఉత్స‌వం,  అంకురార్ప‌ణ  చేప‌ట్టారు.

జులై 30వ తేదీ గురువారం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరుచ్చిపై స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ ఏఈఓ శ్రీ దేవరాజులు, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ సూర్య‌కుమారాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ వేణుగోపాల్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

COMPLAINT TO THE POLICE AGAINST THE WEBSITE OPERATORS


TTD Vigilance Department has identified a fake website named "ttddevasthanam.online" which is going viral on social media. Some people have created this website to resemble the official online services of TTD and are trying to cheat devotees.

This fake website has been created to resemble the official website of TTD, with only minor changes in the domain name. It falsely displays information that Srivari Darshan and Seva tickets are available for the months of August, September and October.

The intention of this fake website is to cheat devotees by collecting money from them in the name of Darshan tickets and also to tarnish the reputation of TTD.

TTD has already complained to the administrators of the relevant domain platform to remove this fake website immediately.  A criminal case has been registered at Tirumala Two Town Police Station regarding the incident. It has also been informed that strict legal action will be taken against those who cheat devotees in future as well.

Devotees are requested to make bookings for TTD services, darshan, accommodation and online tickets only through the official TTD website and official mobile app. They are requested not to be fooled by the unofficial websites and links being circulated on social media.

Sri Soumayanatha Swamy Vari Rathotsavam Held Amid Govinda Chants




The annual Brahmotsavams of Sri Soumyanatha Swamy at Nandaluru witnessed the grand Rathotsavam on Wednesday morning amid continuous chants of "Govinda", Vedic hymns and devotional bhajans.

Sri Soumyanatha Swamy, along with Sridevi and Bhudevi, was taken in a majestic chariot procession through the village streets. Devotees pulled the chariot with devotion and offered Harathi throughout the procession.

The Rathotsavam symbolizes the spiritual journey of the soul and conveys the message of self-realization.

The Aswa Vahana Seva will be held at 7 p.m. on Wednesday.

As part of the Brahmotsavams, Chakrasnanam will be performed on July 31 from 9.15 a.m. to 10.30 a.m., followed by Dhwajavarohanam at 7 p.m., marking the conclusion of the annual festival.

SRI GOVINDARAJA SWAMY POURNAMI GARUDA SEVA HELD GRANDLY


The monthly Pournami Garuda Seva was celebrated with great religious fervour at the Sri Govindaraja Swamy Temple in Tirupati on Wednesday.

As part of the monthly tradition, Sri Govindaraja Swamy was taken in a grand procession on His beloved Garuda Vahanam through the four Mada Streets of the temple from 6 pm to 8 pm, blessing devotees.

Temple Deputy EO V. R. Shanthi, AEO A.B. Narayana Chowdary, Superintendent Chiranjeevi, Temple Inspector Dhananjaya and a large number of devotees participated in the event.

వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ govindaraja swamy vari temple



తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో  బుధ‌వారం పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జ‌రిగింది.

ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బుధ‌వారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల నడుమ శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయ‌ణ చౌద‌రి, సూప‌రింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ధ‌నంజ‌య‌, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.