17.8.26

శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై ఆగస్టు 17 నుంచి 19 వరకు జాతీయ సదస్సు sri vaishnava


తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19 తేదీ వరకు మూడు రోజుల పాటు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.

ఈ సదస్సులో శ్రీ రామానుజాచార్యులు, ఆచార్య పుండరీకాక్షులు, శ్రీ గోవింద భట్టర్‌ (ఎంబార్), శ్రీ దాశరథి (ముదళియాండాన్) వారి జీవితం, ఆధ్యాత్మిక సేవలు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారం, ఆలయ ఆచార–సంప్రదాయాల పరిరక్షణలో వారు చేసిన విశిష్ట కృషిపై పరిశోధనాత్మక చర్చలు జరుగనున్నాయి.

నాలుగు రాష్ట్రాల నుంచి 25 మంది పరిశోధకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 25 మంది పరిశోధకులు, పలువురు పండితులు ఈ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయ వికాసంలో ఆచార్యుల పాత్ర, వారి ఆధ్యాత్మిక సేవలు, దివ్యప్రబంధ ప్రచారం తదితర అంశాలపై లోతైన చర్చలు నిర్వహించనున్నారు.

జీయర్‌ స్వామివార్ల మంగళాశాసనాలతో ప్రారంభం

ఆగస్టు 17న ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామివారు, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామివారి మంగళాశాసనాలతో సదస్సు ప్రారంభమవుతుంది.

ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సదస్సు కొనసాగుతుంది.

శ్రీ వైష్ణవ సంప్రదాయ వైభవాన్ని చాటే సదస్సు

శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారం, దివ్యప్రబంధ పారాయణం, ఆలయ ఆచార–సంప్రదాయాల పరిరక్షణలో వారి అమూల్య కృషిని ఈ సదస్సు ద్వారా నేటి తరానికి పరిచయం చేయనున్నారు. భక్తి, ఆధ్యాత్మికత, పరిశోధనలను సమన్వయం చేస్తూ శ్రీ వైష్ణవ సంప్రదాయ వైభవాన్ని మరింతగా వెలుగులోకి తీసుకురావడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం.

Action Against Person Smoking on the Walking Path




TTD has received an information that a person was found smoking on the Alipiri walking path in violation of its rules. 

A complaint will be filed with the police against the individual, and appropriate legal action will be pursued.

As per TTD regulations, consumption of alcohol, smoking, and use of intoxicating substances, Gutka are strictly prohibited within Tirumala, Alipiri, Srivari Mettu and other areas under TTD jurisdiction. 

Despite these rules, the individual’s act of smoking on the walking path is disrespectful and affects the sentiments of devotees.

TTD has reiterated that strict legal action will be taken against those who violate its regulations. 

Further, if any security personnel are found negligent in carrying out inspections, they will be subject to disciplinary action.

తిరుమలలో శ్రీ కశ్యప మహర్షి జయంతి వేడుకలు kasyapa maharshi


తిరుమలలో శ్రావణమాస హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ కశ్యప మహర్షి యంతి సభా కార్యక్రమం ఆదివారం ఆస్థా మండపంలో వైభవంగా జరిగింది.

టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర ప్రణేతలలో ఒకరైన విఖనస మహర్షి శిష్యులైన శ్రీ కశ్యప మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు.

విఖనస స్తోత్ర పాఠ పారాయణం, మంగళ నిరాజనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం వైఖానస పండితుల ప్రసంగాలు, చర్చాగోష్ఠి నిర్వహించారు.

ఈ సందర్భంగా భగవత్ శాస్త్ర పరంపరలో శ్రీ కశ్యప మహర్షి రచించిన ‘కశ్యప జ్ఞానకాండ’ గ్రంథ వైశిష్ట్యాన్ని పండితులు వివరించారు. శ్రీవారి ఆరాధనా విధానంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది శ్రీ వైఖానస దేవాలయాల్లో ఈ గ్రంథం అత్యంత ప్రామాణికంగా ఉపయోగంలో ఉందని తెలిపారు. వైఖానస ఆగమ సంప్రదాయంలో కశ్యప జ్ఞానకాండకు విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు.

పూజ్య పండితులు రొంపిచర్ల పార్థసారథి భట్టాచార్యుల పరిష్కరణతో కశ్యప జ్ఞానకాండ గ్రంథాన్ని టీటీడీ ముద్రించి భక్తులు, పండితులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.

వైఖానస భగవత్ శాస్త్ర జ్ఞానం, దేవాలయ సంస్కృతితో ముడిపడిన ఆధ్యాత్మిక సంప్రదాయాలు సమాజాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్ది, సత్ప్రవర్తనతో కూడిన జీవనపథంలో నడిపించేందుకు దోహదపడుతున్నాయని వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి తిరుమల శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీమాన్ గంజాం ప్రభాకరాచార్యులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా. నారాయణం తనూజ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

వక్తలుగా డా. నారాయణం కాకుమాను సిద్ధాంతి, అలంకారరత్న శ్రీమాన్ ఎన్.వి.ఎన్. దీక్షితులు, శ్రీమాన్ GVLN శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ గోవర్ధనం రఘునాథ్, వైఖానస విద్యార్థులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు.

నడక దారిలో ధూమపానం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు walking path




అలిపిరి నడక మార్గంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తి ధూమపానం చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది.

నిబంధనల ప్రకారం తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు, ఇతర టీటీడీకి చెందిన ప్రాంతాల్లో మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు సేవించడం పూర్తిగా నిషేధం.

ఈ విషయం తెలిసినప్పటికీ సదరు భక్తుడు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నడకమార్గంలో ధూమపానం చేయడం హేయమైన చర్య.

ఇలా టీటీడీ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడమైనది. అదేవిధంగా  తనిఖీలలో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బంది పై తగు క్రమశిక్షణ చర్యలు  తీసుకోవడం జరుగుతుంది. 

November Darshan and Accommodation online Quota Release Schedule




TTD will release the following Darshan and accommodation quotas online for the month of November:

Aug 18, 10 AM: Srivari Arjitha Seva (Suprabhatham, Thomala, Archana, Ashtadala Pada Padmaradhana). E-dip registration till Aug 20, 10 AM. Payment window: Aug 20–22, till 12 noon.

Aug 21, 10 AM: Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Sahasradeepalankara Seva, Pushpayagam.

Aug 21, 3 PM: Virtual Seva and darshan slots.

Aug 24, 10 AM: Anga Pradakshina tokens.

11 AM: Srivani Trust darshan tickets.

3 PM:  Senior citizens, differently abled, and chronically ill devotees.

Aug 25, 10 AM: Rs. 300 Special Entry Darshan 

Aug 25, 3 PM: Accommodation in Tirumala and Tirupati.

Devotees are advised to book only through the official TTD website: https://ttdevasthanams.ap.gov.in