27.8.26

ఆగమోక్తంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ జీర్ణోద్ధారణ astabandhana samproksham






దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు బుధవారం ఆగమశాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. పవిత్ర కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు.

జీర్ణోద్ధారణ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన మహాసంప్రోక్షణ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తింది. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయానికి పూర్వ వైభవం, పవిత్రత మరింతగా చేకూరాలని ప్రార్థించారు.

మహాసంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం పునఃప్రారంభమైంది.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకున్న టీటీడీ ఈవో

అంతకుముందు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈవోకు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కోదండరామస్వామివారి ఆలయ విశిష్టత, చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని ఈవోకు వివరించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Pavitrotsavams Begin at Tondamanpuram Sri Venkateswara Swamy Vari Temple




The three-day Pavithrotsavams of Sri Venkateswara Swamy, along with Sri Devi and Bhu Devi, at Tondamanpuram began in a grand and devotional manner on Wednesday.

The rituals began in the morning with Suprabhatam, followed by Thomala Seva and Sahasranamarchana. The processional deities of Sri Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi were then taken to the Yagashala, where special Vedic rituals were performed. Chatushtarchana and Pavitra Pratishtha were subsequently conducted by the priests as per Agama traditions.

Special Vedic rituals will be performed in the Yagashala from 5.30 pm to 7.45 pm.

Pavithrotsavams to Preserve Temple Sanctity

Pavithrotsavams are conducted every year for three days to atone for any inadvertent lapses by pilgrims and staff and to preserve the sanctity of the temple. As part of the festival, sacred Pavitra Malas are offered to the deity and special rituals are performed.

Temple Deputy EO Smt. Nagarathna, Temple Inspector Sri Sudheer, temple priests and a large number of devotees participated in the rituals.

వైభవంగా తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం pavitrotsavams





తొండమాన్‌పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేసి ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను అర్చకులు ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు.

సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు యాగశాలలో పలు ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఆలయ పవిత్రత పరిరక్షణకు పవిత్రోత్సవాలు

యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల నివారణతోపాటు ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారికి పవిత్రమాలలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుధీర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Garuda Alwar Pratishta at Vijayawada Sri Venkateswara Swamy Vari Temple from 28th to 31st August




The Garuda Alwar and Bali Peetha Pratishtha and Samprokshanam will be performed as per Agama traditions at the Sri Venkateswara Swamy Temple in the TTD Kalyanamandapam premises, Vijayawada, from August 28 to 31.

The four-day rituals include Ankurarpanam on August 28, Vedic rituals and homams on August 29–30, and Garuda Alwar Pratishtha, Bali Peetha Pratishtha and Samprokshanam on August 31 from 9.15 am to 10.18 am during the auspicious Revathi Nakshatra and Tula Lagna.

A Maha Annadanam will be offered to devotees at noon on August 31.

TTD appeals to devotees to participate in the sacred celebrations and seek the divine blessings of Sri Venkateswara Swamy and Garuda Alwar.

ఆగస్టు 28 నుంచి 31 వరకు విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గరుడాళ్వార్ ప్రతిష్ఠ మహోత్సవాలు garudalwar




విజయవాడ టీటీడీ కల్యాణమండపం ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రుడాళ్వార్, బలిపీఠాల ప్రతిష్ఠ, సంప్రోక్షణ మహోత్సవాలను ఆగస్టు 28 నుంచి 31 తేదీ వరకు ఆగమశాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నారు.

ఆగస్టు 28 అంకురార్పణ

మహోత్సవాలకు ఆగస్టు 28న రాత్రి 7 గంటలకు ప్రార్థనా సూక్త పఠనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు.

ఆగస్టు 29 వైదిక కార్యక్రమాలు

ఆగస్టు 29న ఉదయం 8.45 గంటలకు విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, వాస్తుహోమం, అకల్మషహోమం, పంచగవ్యప్రాశనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు యాగశాలకు సంబంధించిన వైదిక కార్యక్రమాలు జరుగుతాయి.

ఆగస్టు 30 అష్టబంధన ద్రవ్యారాధన

ఆగస్టు 30న ఉదయం 8 గంటలకు అంగహోమం, అక్షిమోచనం, పంచగవ్య, క్షీర, జలాధివాసాలు, అధివాస హోమాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు అష్టబంధన ద్రవ్యారాధన, 11 గంటలకు గరుడబింబ స్థాపన, సాయంత్రం 4 గంటలకు మహాశాంతి తిరుమంజనం, రాత్రి 7 గంటలకు మహాశాంతి హోమం నిర్వహించనున్నారు.

ఆగస్టు 31 గరుడాళ్వార్ ప్రతిష్, సంప్రోక్షణ

ఆగస్టు 31న రేవతి నక్షత్రం, తులా లగ్నంలో ఉదయం 9.15 నుంచి 10.18 గంటల వరకు శుభ ముహూర్తంలో ఆలయం చుట్టూ అష్టదిక్కుల్లో బలిపీఠాల ప్రతిష్ఠ, నూతన గరుడాలయంలో గరుడాళ్వార్ ప్రతిష్ఠ, సంప్రోక్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

అనంతరం ఆలయ వాస్తుశుద్ధి, నవకలశస్నపనం, కళావాహనం, ప్రథమార్చన, గోదర్శనం, ఆచార్య సన్మానం, బ్రహ్మఘోష, యజమాన ఆశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ

ఆగస్టు 31న మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నారు.

ఈ పవిత్ర గరుడాళ్వార్ ప్రతిష్ఠ, బలిపీఠాల ప్రతిష్ఠ, సంప్రోక్షణ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వేంకటేశ్వరస్వామివారి, గరుడాళ్వార్ దివ్య కృపాకటాక్షాలను పొందాలని టీటీడీ కోరుతోంది.