The Sri Mahalakshmi Deepa Puja will be held grandly at 6 pm on Friday, July 10, at the Sri Kodandarama Swamy Temple premises, Chandragiri.
TTD JEO Dr. A. Sharath reviewed the arrangements on Thursday and directed officials to ensure smooth conduct of the event with coordinated efforts by all departments.
TTD has arranged spacious sheds, mats, Deepa Puja materials, Annaprasadam counters, drinking water, LED screens, temporary toilets and sanitation facilities for the convenience of devotees. The temple premises have also been decorated with special lighting and floral arrangements.
The spiritual event will be telecast live on SVBC.
Deputy EO Smt. Nagaratna, VGO Sri Giridhar, DE Smt. Saraswathi, officials of various departments and SVBC participated in the inspection.
TTD will conduct the annual Anivara Asthanam in a grand and traditional manner at Sri Govindaraja Swamy Temple and Sri Kodanda Rama Swamy Temple, Tirupati, on July 17.
Anivara Asthanam is a special annual court ceremony observed on the last day of the Tamil month of Aani. During the Mahant era, it marked the beginning of the temple's annual accounts and administration.
At Sri Govindaraja Swamy Temple, the Asthanam will be held from 5.30 p.m. to 6.30 p.m. at the Bangaru Vakili in the presence of Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi. New silk clothes will be brought in a ceremonial procession from Sri Pundarikavalli Ammavari Temple and offered to the deity.
At Sri Kodanda Rama Swamy Temple, the Asthanam will be conducted from 4 p.m. to 5 p.m. before Garudalwar for the utsava deities of Sri Kodanda Rama Swamy with Sita and Lakshmana. New garments will later be ceremonially offered to both the presiding and utsava deities.
Tirumala Jeeyar Swamys and temple officials will participate in the ceremony.
శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో గురువారం ఆయన తిరుపతి జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
• 08-09-2026 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
• 14-09-2026 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
• 15-09-2026 ధ్వజారోహణం.
• 19-09-2026 గరుడ వాహనం.
• 22-09-2026 రథోత్సవం.
• 23-09-2026 చక్రస్నానం.
• ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు.
• బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
• వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు.
• విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం.
• భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం.
• భక్తుల అవసరాలకనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని ఆదేశం.
• గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని ఆదేశం.
• భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశం.
• శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశం.
• గరుడసేవకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 18-09-2026 రాత్రి 9 నుండి 20-09-2026 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ.
• భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని ఆదేశం.
ఈ సమావేశంలో సీఈ శ్రీ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, శ్రీ రాజేంద్ర, శ్రీ సోమన్నారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, సీఎంఓ డాక్టర్ కుసుమ కుమారి, డిఈ శ్రీ చంద్ర శేఖర్, వీజీవో శ్రీ సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ జీ.ఎల్.ఎన్. శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గురువారం ఆలయ ప్రాంగణంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, దీపపూజలో పాల్గొనే వేలాది మంది భక్తుల కోసం విశాలమైన షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, తాగునీటి సౌకర్యం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణకు అదనపు సిబ్బంది తదితర సౌకర్యాలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.
అలాగే టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, సుందర పుష్పాలంకరణలతో దివ్యంగా అలంకరించాలని, భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలను మరింతగా పెంపొందించేలా పవిత్ర వాతావరణాన్ని సృష్టించాలని సూచించారు.
ఈ మహోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజీవో శ్రీ గిరిధర్, డీఈ శ్రీమతి సరస్వతి, పలు శాఖల అధికారులు, ఎస్వీబీసీ అధికారులు పాల్గొన్నారు.