11.8.26

JEO DR. A. SHARATH REVIEWS DEVELOPMENT WORKS AT NARAYANAVANAM AND NAGALAPURAM TEMPLES


TTD JEO Dr. A. Sharath directed officials to ensure all necessary arrangements for the convenience of devotees visiting Sri Padmavathi Sametha Sri Kalyana Venkateswara Swamy Temple, Narayanavanam, and Sri Vedanarayana Swamy Temple, Nagalapuram.

On Monday evening, the JEO visited both temples along with officials and inspected the ongoing development works. He reviewed the progress with the officials and instructed the engineering staff to complete the works on time with quality.

He also directed officials to take steps to create a more devotional and pleasant atmosphere in the temple premises and to give special attention to devotees' facilities, including queue lines, drinking water, sanitation and cleanliness.

All departments should work in coordination to provide devotees with a peaceful spiritual experience and a smooth darshan, he said.

The JEO also reviewed the daily Annadanam being provided to devotees with the support of donors and instructed officials to ensure uninterrupted supply of quality food.

Later, he inspected the Vahana Mandapam, Pottu (temple kitchen) and various development works in the temple premises, and gave further instructions based on devotees' requirements.

Temple Deputy EO Smt. B. Nagaratna, Superintendent Sri A. Dharmayya, Temple Inspector Sri Srinivasulu, engineering officials, archakas and other staff participated in the inspection.

NEW JEO FOR H & E ASSUMES CHARGE


Prabhala Gopinath, has assumed charge as JEO for Health and Education on Monday evening at the Tirumala Srivari Temple.

Afterwards he had Darshan of the presiding deity of Sri Venkateswara Swamy along with his family members.

Temple Dy EO Sri Lokanatham,  Board Cell Dy EO Smt. Prashanti and other officials took part in the event.

టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ ttd new jeo



టీటీడీ నూతన జేఈవో (వైద్యం మరియు విద్య)గా నియమితులైన శ్రీ ప్రభల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Truck Donated to TTD




Lokanatha Reddy, Managing Partner of Sri Venkateswara Motors, Tirupati, donated an SML Mahindra truck worth Rs.15.24 lakh to TTD on Monday.

On this occasion, the donor performed special pujas to the vehicle in front of the Srivari Temple and handed over the vehicle keys to Sri Lokanatham, Deputy EO of the Srivari Temple.

పూర్ణాహుతితో వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు poornahuti





తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో, ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు సోమవారం సాయంత్రం పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి.

పవిత్రోత్సవాల చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం భక్తిభావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేష అభిషేకం చేసి స్వామివారికి పవిత్ర జలధారలతో అభిషేక సేవ సమర్పించారు.

సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భాష్యకార్ల గుడి వద్ద ఇయల్‌ శాత్తుమొర నిర్వహించారు.

ఆ తర్వాత ఆలయంలోని యాగశాలలో వేద మంత్రోచ్ఛారణల నడుమ వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం ఉత్సవమూర్తులు, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణగా సన్నిధికి తీసుకువచ్చి కుంభావాహనం తదితర పవిత్ర క్రతువులను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.

ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయం వేద మంత్రఘోషతో, భక్తుల గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి కృపాకటాక్షాలు భక్తులందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి.

ఈ కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ కె.  శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నారాయణవనం, నాగలాపురం ఆలయాల అభివృద్ధి పనులపై జేఈవో డా. ఎ. శరత్ సమీక్ష ttd addl eo


నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లను  చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో కలిసి రెండు ఆలయాలను సందర్శించి, ఆలయాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్దేశిత సమయానికి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. భక్తులకు ఆలయ పరిసరాల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆలయ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని జేఈవో ఆదేశించారు.

భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కలిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అలాగే దాతల సహకారంతో ఆలయాల్లో ప్రతిరోజూ భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 

భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన అన్నప్రసాదాలను నిరంతరం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం వాహన మండపం, పోటు, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, భక్తుల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన అదనపు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి బి.  నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ ఎ. ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీకి ట్రక్ విరాళం donation




తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ శ్రీ లోకనాథ రెడ్డి సోమవారం రూ.15.24 లక్షలు వైలువైన ఎస్.ఎం.ఎల్.మహీంద్ర ట్రక్ ను విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు వాహన తాళాలను అందజేశారు.