13.8.26

ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతానికి వైభవంగా ఏర్పాట్లు varalakshmi vratam






తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నానితో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేఈవో సూచించారు. గత అనుభవాలను సమీక్షించి, లోపాలను సరిదిద్దుతూ భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కల్పించాలని ఆదేశించారు.

ఆగస్టు 21న శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్‌సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.

భక్తులకు విస్తృత సౌకర్యాలు

మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, పెండాళ్లు, సూచిక బోర్డులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని జేఈవో ఆదేశించారు. తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం విస్తృతంగా అందించడంతో పాటు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచాలన్నారు.

భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలని, ఆలయం, ఆస్థానమండపం పరిసరాలను పుష్పాలు, విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించాలని సూచించారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాలని, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీసు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు : ఎమ్మెల్యే పులివర్తి నాని

చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని

మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రద్దీకి అనుగుణంగా తాగునీరు, మజ్జిగ, పెండాళ్లు, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. భక్తులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి కృపాకటాక్షాలతో చంద్రగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

13న ఆన్ లైన్ లో టికెట్ల విడుదల

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గం.లకు ఆన్ లైన్ లో టికెట్లను విడుదల చేయనున్నారు. ఆఫ్ లైన్ టికెట్లను ఒక రోజు ముందు ఆలయ ముందు ఉన్న కౌంటర్ లో విడుదల చేయనున్నారు.

వరలక్ష్మీ వ్రతానికి పురాణ ప్రాశస్త్యం

స్కంద, భవిష్యోత్తర పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రత విశిష్టతను, ఆచరించే విధానాన్ని వివరించినట్లు అర్చకులు తెలిపారు. శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాశస్త్యం ఉంది.

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించే మహిళలకు సత్సంతానం, దీర్ఘ సుమంగళీ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్‌ఈ శ్రీ నరసింహమూర్తి, డీఈ శ్రీ రవిశంకర్‌రెడ్డి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీ శ్రీహరిరావు, కేటరింగ్ అధికారి శ్రీ విజయభాస్కర్, ఆలయ అర్చకులు, పోలీసు, పంచాయతీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

SRI CHAKRATHALWAR SATTUMORA HELD GRANDLY AT SRI GOVINDARAJA SWAMY TEMPLE



The Sri Chakrathalwar Sattumora and Sri Prativadi Bhayankaram Annan Sattumora were held with devotion and grandeur at Sri Govindaraja Swamy Temple in Tirupati on Wednesday.

As part of the celebrations, Sri Varadaraja Swamy along with His consorts and Sri Prativadi Bhayankaram Annan were taken in a grand procession from Sri Lakshmi Narayana Swamy Temple through the four Mada streets from 8 am to 9.30 am, blessing the devotees.

From 9.30 am to 10 am, Appapadi Prasadam from the Tirumala Srivari Temple was brought in a procession from Sri Kodandarama Swamy Temple to Sri Lakshmi Narayana Swamy Temple, where Sattumora was performed.

In the evening, from 4 pm to 5.30 pm, Sri Govindaraja Swamy along with Sri Devi and Bhu Devi, and Sri Chakrathalwar will be taken in a procession through the four Mada streets for the darshan of devotees. This will be followed by the procession of Sri Andal Ammavaru.

Deputy EO Smt. V.R. Shanthi, AEO Sri A.B. Narayana Chowdary, Superintendent Sri Chiranjeevi, Temple Inspector Sri Dhananjaya, temple priests, staff and a large number of devotees participated in the celebrations.

National Seminar on Spiritual Contributions of Sri Vaishnavi Acharyas from August 17th to 19th




A three-day national seminar on the spiritual contributions of Sri Vaishnava Acharyas will be held at Annamacharya Kalamandiram, Tirupati, from August 17 to 19, under the aegis of TTD’s Alwar Divya Prabandha Project.

The seminar will focus on the lives and spiritual contributions of Sri Ramanuja, Acharya Pundarikaksha, Sri Govinda Bhattar (Embar) and Sri Dasarathi (Mudaliandan), their propagation of Visishtadvaita philosophy, and their role in preserving temple traditions and practices.

25 Scholars from Four States

Twenty-five researchers and scholars from Andhra Pradesh, Telangana, Tamil Nadu and Karnataka will participate and present research papers. Discussions will focus on the contribution of these Acharyas to the growth and preservation of the Sri Vaishnava tradition.

To Begin with Mangala Sasanam by Jeeyar Swamijis

The seminar will commence at 10 am on August 17 with the Mangala Sasanam of Tirumala Pedda Jeeyar Swamiji and Chinna Jeeyar Swamiji.

Sessions will be held from 10 am to 1 pm and 2 pm to 5.45 pm on all three days.

Spiritual Contributions of the Acharyas

Acharya Pundarikaksha, belonging to the lineage of Sri Nathamuni, played a significant role in systematising and promoting the recitation of the Nalayira Divya Prabandham in Vaishnava Divya Desams, a tradition that continues to this day.

Sri Ramanuja and Sri Govinda Bhattar (Embar) studied together at the Gurukulam at Tirupputkuzhi. Sri Ramanuja later spent a year listening to Sri Ramayana discourses from Tirumala Nambi at Alipiri. He visited Tirumala three times and is traditionally credited with systematising several worship practices and temple traditions at the Sri Venkateswara Swamy Temple.

Sri Govinda Bhattar (Embar), a nephew and close disciple of Sri Ramanuja, played an important role in propagating Visishtadvaita philosophy and the teachings of Ramanuja.

Sri Dasarathi (Mudaliandan), another nephew of Sri Ramanuja, rendered distinguished service in the administration of Srirangam Temple and in the preservation of the Sri Vaishnava tradition.

Showcasing the Glory of Sri Vaishnava Tradition

The seminar aims to bring to the present generation the valuable spiritual contributions of the Sri Vaishnava Acharyas, their propagation of Visishtadvaita philosophy, Divya Prabandham recitation and their efforts to preserve temple traditions and practices.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొర sri chakrattalvar sattumora





తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం నుంచి ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ఉభయ నాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారు, శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ స్వామివార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో మంగళవాయిద్యాల నడుమ ఊరేగించి భక్తులకు దర్శనమిచ్చారు.

అనంతరం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన అప్పపడి ప్రసాదాన్ని శ్రీకోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి సాత్తుమొర నిర్వహించారు.

సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ చక్రత్తాళ్వార్‌ స్వామివార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అనంతరం శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏ బీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్‌ శ్రీ చిరంజీవి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధనంజయ, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఎస్వీ గోశాలలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం elephants day





ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగస్టు 12) సందర్భంగా తిరుపతి ఎస్వీ గోశాలలో టిటిడి ఆలయ ఊరేగింపుల్లో పాల్గొనే లక్ష్మి, వైష్ణవి, పద్మావతి అనే మూడు ఆడ ఏనుగులకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం గోశాల డైరెక్టర్ శ్రీ ఎ.వి.ఎన్. శివకుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఆలయ సంప్రదాయాల్లో భాగంగా సేవలందిస్తున్న గజరాజులను టీటీడీ ప్రేమతో, ఆధ్యాత్మిక భావంతో సంరక్షిస్తూ, వాటి ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలు గజరాజుల పట్ల భక్తులకున్న గౌరవం, అనుబంధాన్ని చాటాయి.

ఈ కార్యక్రమంలో గోశాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

World Elephant Dya Observed at SV Goshala




TTD observed World Elephant Day (August 12) at SV Goshala, Tirupati, by performing special prayers for three female elephants—Lakshmi, Vaishnavi and Padmavathi—which participate in temple processions. The programme was held on Wednesday in the presence of SV Goshala Director Dr. A.V.N. Sivakumar.

TTD is taking special care of the elephants serving as part of temple traditions, with attention to their health, welfare and overall well-being.

The special prayers conducted on World Elephant Day reflected the devotion, respect and affection of devotees towards the temple elephants.

Goshala officials and staff participated in the programme.

Elaborate Arrangements for Varalakshmi Vratam on 21st August





TTD is making elaborate arrangements for the Varalakshmi Vratam to be held at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, on August 21. TTD JEO Dr. A. Sharath directed officials to ensure that devotees receive the best possible facilities and a peaceful spiritual experience.

The JEO reviewed the arrangements with officials along with Chandragiri MLA Sri Pulivarthi Nani at the Asthana Mandapam in Tiruchanoor on Wednesday.

The JEO directed officials to make comprehensive arrangements for darshan, queue lines, drinking water, buttermilk, Annaprasadam, sanitation and security, keeping the expected rush in view. He also instructed officials to review previous arrangements and rectify any shortcomings.

The Varalakshmi Vratam will be performed as per Agama traditions at the Asthana Mandapam from 10 am to 12 noon on August 21 (Friday). At 6 pm, Sri Padmavathi Ammavaru will bless devotees during a procession on the golden chariot along the four Mada streets.

Abhishekam, post-Abhishekam darshan, Lakshmi Puja, Kalyanotsavam, Break Darshan and Unjal Seva will remain cancelled on the day due to the Vratam.

Extensive facilities for devotees

As a large number of women devotees are expected, the JEO directed officials to arrange queue lines, pandals, signboards and LED screens. Adequate drinking water, buttermilk and Annaprasadam should be provided. Kumkum packets, sacred bangles and glass bangles should also be kept ready for distribution.

He directed officials to arrange bhajan groups and decorate the temple and Asthana Mandapam with flowers and illumination. Adequate Srivari Sevaks, sanitation workers and security personnel should be deployed. Coordination with the police and local Panchayat authorities should be ensured to avoid traffic, parking and security issues.

Arrangements should also be made for the live telecast of the Varalakshmi Vratam on SVBC, the JEO said.

No inconvenience to devotees : MLA Pulivarthi Nani

Chandragiri MLA Sri Pulivarthi Nani directed officials to ensure that devotees face no inconvenience during the Varalakshmi Vratam. He stressed the need for adequate drinking water, buttermilk, pandals and parking facilities according to the pilgrim rush.

He also suggested setting up a Help Desk to provide information to devotees.

He prayed for the blessings of Sri Padmavathi Ammavaru for the prosperity, happiness and good health of the people of Chandragiri constituency, the district and the State.

Online tickets on August 13

Online tickets for the Varalakshmi Vratam will be released on August 13 at 10 am. Offline tickets will be issued at the counter in front of the temple one day before the Vratam.

Spiritual significance

According to the Skanda and Bhavishyottara Puranas, Lord Shiva explained the significance and procedure of Varalakshmi Vratam to Goddess Parvati. Tiruchanoor, renowned as the sacred abode where Sri Mahalakshmi manifested, holds special significance for this Vratam.

The Vratam is traditionally observed on the Friday preceding the Shravan Purnima. The scriptures state that women who perform the Vratam with devotion are blessed with good progeny, marital bliss, prosperity, good health and family happiness, the temple priests said.

Temple Deputy EO Sri Harendranath, SE Sri Narasimha Murthy, DE Sri Ravishankar Reddy, Additional Health Officer Dr. Sunil, AEO Sri Devarajulu, AVSO Sri Srihari Rao, Catering Officer Sri Vijayabhaskar, temple priests, police and Panchayat officials and officials from various departments participated in the review meeting.