29.8.26

Tondamanpuram Sri Venakateswara Swmay Vari Temple Pavitrotsavams Concludes with Chakrasnanam






The three-day Pavithrotsavams at Tondamanpuram Sri Venkateswara Swamy Temple concluded grandly on Friday morning with Chakrasnanam.


On the final day, Maha Purnahuti and Pavitra Vitarana were performed, followed by Snapan Tirumanjanam to Sri Venkateswara Swamy along with Sridevi and Bhudevi, and Sri Chakrathalwar.


Later, Chakrathalwar was given the sacred Chakrasnanam, marking the completion of the Pavithrotsava rituals.

A Gramotsavam was also held in the evening. A large number of devotees participated and had the darshan of the Lord.


AEo Smt. Kumari Devi, Superintendent Sri Gnana Prakash, Temple Inspector Sri Sudheer, temple priests, staff and devotees participated in the celebrations.

చక్రస్నానంతో ఘనంగా ముగిసిన తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు chakrasnanam







తొండమాన్‌పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజులుగా ఆగమశాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారం ఉదయం పవిత్రమైన చక్రస్నాన ఘట్టంతో వైభవంగా ముగిశాయి.


పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.


తదుపరి శ్రీ చక్రతాళ్వార్లకు చక్రస్నానం అత్యంత భక్తిభావంతో నిర్వహించడంతో పవిత్రోత్సవాల వైదిక కార్యక్రమాలు సంపూర్ణమయ్యాయి. పవిత్ర ఘట్టాన్ని వీక్షించిన భక్తులు స్వామివారి కృపకు పాత్రులయ్యారు.


సాయంత్రం ఆలయ పరిసరాల్లో గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ జరిగిన ఉత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి దివ్యదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


కార్యక్రమంలో ఏఈఓ శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన ప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుధీర్, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

76th Death Anniversary of Veturi Prabhakara Sastry on 29th August




The 76th death anniversary of Sri Veturi Prabhakara Sastry, who brought the valuable literary works of Tallapaka Annamacharya to light, will be observed in Tirupati on August 29.


TTD officials will pay floral tributes to his bronze statue in front of SVETA Bhavan at 9 am. A literary seminar on his services will be held at Annamacharya Kala Mandir at 10.30 am.


Veturi Prabhakara Sastry played a key role in bringing Annamayya’s devotional literature, which remained unnoticed for nearly 400 years, to the public. His contribution to Telugu devotional literature remains memorable.

వైఖానస ఆగమం విశిష్టమైన వైదిక ఆగమ సంప్రదాయం vaikhanasa maharshi



తిరుమలలో శుక్రవారం శ్రీ విఖనస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆస్థాన మండపంలో టీటీడీ అళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధని సభ సంయుక్త ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించారు.


శ్రీ విఖనస మహర్షి జయంతిని పురస్కరించుకుని తిరుమలలో నిర్వహించిన సభలో పండితులు వైఖానస ఆగమ విశిష్టతను వివరించారు. శ్రీ విఖనస మహర్షి వైఖానస ఆగమానికి మూలకర్త అని, వైఖానస కల్పసూత్రం ఆధారంగా ఏర్పడిన ఈ సంప్రదాయం ఆలయ నిర్మాణం, ప్రతిష్ఠ, అర్చన, ఉత్సవాలు, జ్ఞానం, యోగం తదితర అంశాలను శాస్త్రబద్ధంగా వివరిస్తుందని తెలిపారు.


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి వైఖానస ఆగమ విధానంలోనే అర్చనాదులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వైఖానస ఆగమం భక్తి, ధర్మం, దయ, కరుణ, సర్వజీవహితం వంటి విశాలమైన ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుందని తెలిపారు.


ఈ ప్రాచీన జ్ఞానసంపదను పరిరక్షించి, పరిశోధించి, భవిష్యత్ తరాలకు అందించడంలో టీటీడీ చేస్తున్న కృషిని వక్తలు అభినందించారు.


ఈ కార్యక్రమానికి శ్రీ విఖనస ట్రస్ట్ కార్యదర్శి శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా శ్రీ అగ్నిహోత్ర సనత్ కుమార్ ఆచార్యులు, ప్రధాన వక్తలుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొఫెసర్ డాక్టర్ వేదాంతం శ్రీవిష్ణు భట్టాచార్యులు, నంద్యాల నేషనల్ కళాశాల సంస్కృత ఆచార్యులు డాక్టర్ డి.వి. హయగ్రీవాచార్యులు పాల్గొన్నారు. శ్రీ జీవీఎల్ఎన్ శ్రావణ్ కుమార్, శ్రీ అగ్నిహోత్రం శ్రీకర్, శ్రీమతి గుడిమళ్ల మాధురి, శ్రీ నారాయణ వరాహ వెంకట నరసింహ దీక్షితులు, శ్రీ గోవర్ధనం రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ sravana upakarma



తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శ్రావణ ఉపకర్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు.


అనంతరం ఉదయం 6.30 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీకృష్ణస్వామివారిని మంగళవాయిద్యాల నడుమ కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ స్నపన తిరుమంజనం, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం స్వామివారిని ఆలయానికి వైభవంగా తీసుకువచ్చారు.


సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు శ్రీభూసమేత శ్రీగోవిందరాజస్వామివారిని ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యుల ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు.


శ్రావణ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ పవిత్ర ఉపకర్మలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యదర్శనం చేసుకున్నారు.


ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏ.బి. నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఆలయ అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.