In Tirumala, the TTD staff returned a purse, a gold bracelet weighing 12 grams worth Rs. 1.10 lakh, and a wristwatch that were left behind in a room at Krishna Sadan Rest House by a devotee, Sri Kalluri Venkata Subbarao from Prakasam district, on Thursday.
On this occasion, the devotee expressed his gratitude to Sri Mahidhar Reddy, who works as an attendant at Krishna Sadan.
Sri Padmavathi Enquiry Office Superintendent Sri Vijay Kumar along with other staff, participated in this program.
The 79th Independence Day was observed with patriotic fervour in Tirumala on Friday.
TTD Trust Board Chairman Sri BR Naidu hoisted the National Flag in his camp office and offered Salute.
At Gokulam Rest House the TTD Additional EO after hoisting the National Flag and offering Salute in his speech asked all the staff to get inspired by the value based system provided by the great National Leaders.
Service to Humanity is Service to Divinity and it is the prime motto of TTD. With Unity and team work we should serve devotees as we always do. The one year stats show the improvements in the areas of Annaprasadam, Sanitation and other facilities to the devotees in Tirumala, he asserted.
He called on employees to continue their impeccable services to the devotees with the same enthusiasm in future also.
On this occasion he thanked the employees, retired employees, Srivari Sevaks, and above all devotees for extending their support in achieving the targets mulled by TTD keeping in view the larger interests of the multitude of the visiting pilgrims.
CE Sri Satyanarayana, Dy Civil Surgeon of Aswini Hospital Dr Kusuma Kumari, VGO Sri Ramkumar, DyEOs Sri Venkataiah, Sri Rajendra Kumar, Sri Venkateswarlu, Sri Somannarayana and others were also present.
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ క్రిష్ణయ్య పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 41 మంది అధికారులు, 278 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు.
ఆలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు " కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ......", " జై అందమంతా ఒకటై ....." తదితర దేశభక్తి, ఆధ్యాత్మిక గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఆగష్టు 15న నిర్వహించే 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
జాతీయ జెండా వందనం అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
అణగారిన వర్గాల ఆత్మ బంధువు డా|| బి.ఆర్.అంబేద్కర్ అని భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించి అందరికి సమాన అవకాశాలు కల్పించిన మహానుభావుడని, దళితులు, వెనుకబడిన వర్గాలు, స్త్రీలకు కూడా ఉన్నత అవకాశాలు కల్పించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ న్యాయ నిపుణులు శ్రీ శ్రీకాంత్ పేర్కొన్నారు. అంబేద్కర్ 134వ జయంతిని సోమవారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులలో కూడా అట్టడుగు స్థాయి నుండి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన అంబేద్కర్‌ను భారతీయులందరూ ఆదర్శంగా భావించాలన్నారు. ఆయనకు అన్ని శాస్త్రాల్లో విస్తృతమైన పరిజ్ఞానం ఉండేదని తెలిపారు. హైందవ సమాజం ఎల్లప్పుడూ సర్వసమానత్వాన్నే బోధిస్తుందని, ఎలాంటి అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమించిన మహానాయకుడని వివరించారు.
అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి, అందుకు అవసరమైన చట్టాలను తీసుకువచ్చినట్లు తెలిపారు. మన ఆలోచన విధానం మారిన నాడే అంబేద్కర్ ఆశయాలు సిద్ధిస్తాయని తెలిపారు. అంబేద్కర్ కృషి వల్లనే సగటు భారతీయుడు నేడు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అనుభవించగలుగుతున్నారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.
అనంతరం విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయులు శ్రీ విద్యా సాగర్ రావు ప్రసంగిస్తూ, అంబేద్కర్ మహనీయుడు కావడం వెనక సమాజంలోని అన్ని వర్గాల వారి సహకారం ఉందన్నారు. కష్టపడేతత్వం ఉంటే
ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. భారతదేశ ప్రజలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని నిర్మించారని తెలిపారు. అంబేద్కర్ రచనలను చదివితే ఒక దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రగతికి అవసరమయ్యే అన్ని అంశాలను తెలుసుకోవచ్చన్నారు.
దళితులు విద్యనభ్యసించి చైతన్య వంతులైనప్పుడే సమాజంలో అంతరాలు తొలగిపోతాయని తెలియజేశారు. ఆయన స్ఫూర్తితో జీవితాన్ని అభివృద్ధిచేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. దళిత, గిరిజనులను గౌరవిస్తూ టిటిడి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
అనంతరం పలువురు టిటిడి ఉద్యోగులు ప్రసంగించారు.
తర్వాత టిటిడి లోని అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 45 మంది ఉద్యోగులకు మెమెంటోలు అందజేశారు.
అంతకుముందు డిప్యూటీ ఈవో శ్రీ ఆనంద రాజు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, డా|| బి.ఆర్.అంబేద్కర్ పటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ దేవేంద్ర బాబు, శ్రీ లక్ష్మణ్ నాయక్, ఇతర అధికార ప్రముఖులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు శనివారం విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో 93% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 623 మంది విద్యార్థినులు పరీక్షలు వ్రాయగా, 570 మంది విజయం సాధించారు. ఇందులో 380 మంది డిస్టెన్షన్, 142 మంది ప్రథమ శ్రేణి, 42 మంది ద్వితీయ శ్రేణి ,13 మంది తృతీయ శ్రేణి సాధించారు.
అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 717 మంది విద్యార్థినులు పరీక్షలు వ్యాయగా 571 మంది (80%) విజయం సాధించారు. ఇందులో 328 మంది డిస్టెన్షన్, 149 మంది ప్రధమ, 68 మంది ద్వితీయ, 16 మంది తృతీయ శ్రేణి పొందారు.
తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో 84.50% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో శ్రీ వెంకట చరణ్ అనే విద్యార్థి 977 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచారు.
కళాశాలలో 355 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 300 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఏ గ్రేడ్ 148, బి గ్రేడ్ 101, సీ గ్రేడ్ 34, డి గ్రేడ్ 17 మంది పొందారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో శ్రీ లక్ష్మీ చరణ్ అనే విద్యార్థి 461 (98.08%) మార్కులతో కాలేజీ టాపర్ గా నిలిచారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 531 మంది విద్యార్థులు వ్రాయగా, 309 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఏ గ్రేడ్ - 132,
బి గ్రేడ్
-108, సీ గ్రేడ్- 48, డి గ్రేడ్ - 28 మంది విద్యార్థులు పొందారు.
ప్రతిభ కనబరచిన విద్యార్థులను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, జేఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.