12.8.26

ఆగస్టు 14న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం tiruvadipuram



తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 14న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

అనంతరం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థానం నిర్వహిస్తారు. 

ప్రత్యేక పూజల అనంతరం అలిపిరి నుంచి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌.ఎస్‌. మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

ఈ పవిత్ర ఉత్సవంలో భక్తులు పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

No comments :
Write comments