Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

25.8.26

విలువలతో కూడిన విద్యే ఉత్తమ సమాజానికి పునాది – విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మికతను పెంపొందించడమే “సద్గమయ” లక్ష్యం – డీపీపీ కార్యదర్శి డా. మేడసాని మోహన్ dpp secretary






విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక అవగాహనతో పాటుసనాతన ధర్మంపై జ్ఞానాన్ని పెంపొందించడమే “సద్గమయ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా. మేడసాని మోహన్ తెలిపారు.

టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోసోమవారం “సద్గమయ” కార్యక్రమాన్ని డా. మేడసాని మోహన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యతో పాటు విలువలు, సంస్కారం, ఆధ్యాత్మిక చైతన్యంఅందించినప్పుడే ఉత్తమ వ్యక్తిత్వం, బాధ్యతాయుత పౌరసమాజం నిర్మాణమవుతుందని అన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీతతో పాటు మహనీయుల జీవితాలు, వారిబోధనల ద్వారా విద్యార్థులకు విలువాధారిత విద్యను అందించనున్నట్లు తెలిపారు.

“సద్గమయ” ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, భక్తి, సత్యనిష్ఠ, సత్ప్రవర్తన, దేశభక్తి, భారతీయ సంస్కృతిపైగౌరవం వంటి సద్గుణాలను విద్యార్థుల్లో పెంపొందిస్తామని చెప్పారు.

నీతి పద్యాలు, సుభాషితాలు, ఎంపిక చేసిన పద్యాలను విద్యార్థులు నేర్చుకుని, వాటి భావాలను అర్థంచేసుకుని జీవితంలో ఆచరించేలా ప్రోత్సహిస్తామన్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వ్యక్తీకరణ సామర్థ్యంతోపాటు నైతిక వ్యక్తిత్వం కూడా వికసిస్తుందని వివరించారు.

ప్రహ్లాదుడు, ధ్రువుడు, నచికేతుడు వంటి బాల భక్తుల అచంచల భక్తి, ధైర్యం, ఏకాగ్రత, పట్టుదలనువిద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భక్తి, జ్ఞానం, సత్ప్రవర్తనతో జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

సాధారణ విద్యతో పాటు విలువాధారిత, ఆధ్యాత్మిక విద్యను అందించి సంస్కారవంతమైన, క్రమశిక్షణకలిగిన, బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే “సద్గమయ” ధ్యేయమని డా. మేడసానిమోహన్ స్పష్టం చేశారు.

7 టీటీడీ పాఠశాలల్లో 1,678 మంది విద్యార్థులకు “సద్గమయ”

ఆగస్టు 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి, తిరుమలలోని 7 టీటీడీ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతులవిద్యార్థులకు “సద్గమయ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం4.45 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 1,678 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.

కార్యక్రమంలో వేద ఆశీర్వచనం, క్విజ్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటువిద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డీపీపీ అదనపు కార్యదర్శి శ్రీమతి కల్యాణి, ఏఈవో శ్రీ సత్యనారాయణ, శ్రీ గోవిందరాజస్వామిఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


GRAND COMMENCEMENT OF ASHTABANDHANA MAHASAMPROKSHANAM AT DEVUNI KADAPA TEMPLE



The Jeernoddharana Ashtabandhana Mahasamprokshanam rituals at Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa, commenced grandly on Monday with devotion and traditional fervour.

As part of the first-day rituals, priests performed Manonmana Pramana Shanti Homam, Kumbha Sthapana, Panchagni Pranayanam and Sattumora in accordance with Agama traditions from 8 a.m. Special Vedic rituals will be performed at the Yagasala at 6.30 p.m.

Ashtabandhanam on August 25

On August 25, Chatushthanarchana, Ekashiti Kalasa Snapanam, Murthi Homam and Ashtabandhanam will be performed from 7.30 a.m. In the evening, Shayyadhivasam, Tattva Homams, Shanti Homam and Sattumora will be conducted from 6 p.m.

Mahasamprokshanam on August 26

On August 26, Chatushthanarchana, Murthi Homam and Prayaschitta Homam will be performed from 7 a.m.

The Maha Poornahuthi, Mahasamprokshanam and Kalakarshanam will be performed as per Agama traditions from 9.45 a.m. to 11.30 a.m. under the auspicious Shravan Nakshatra and Tula Lagna.

Devotees will be allowed darshan of Sri Lakshmi Venkateswara Swamy after completion of the Mahasamprokshanam rituals.

AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Eshwar Reddy and temple priests participated in the sacred rituals.

Pavitrotsavams Enters Second Day









The three‑day annual Pavitrotsavams entered its second day on Monday at Tirumala. 

Sacred and colourful Pavitra Malas (Garlands) were offered to the presiding and utsava deities as part of the observance.

Historical background

Also known as Sarva Doshopansamana Utsavam (Sin-free festival), Pavitrotsavams were prevalent during the 15th–16th centuries and were reinstated by the Tirumala Tirupati Devasthanams (TTD) in 1962. 

These utsavams are purification rites and are also described by names such as Dosha Nivarana, Sarva Yagna Phalaprada, Sarva Kamaprada and Sarva Tustikara festival.

Significance of Pavitra Garlands:

The Pavitra Malas are woven out of pure silk threads in black(dark blue), green, yellow, red and white. 

These sacred threads are prepared from a high‑grade cotton variety.

Rituals performed:

Early in the morning, Snapana Tirumanjanam was performed to the utsava deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi. Following the abhishekam, the Pavitra Malas were adorned on the utsava deities.

Both the Senior and Junior Pontiffs of Tirumala, TTD Executive Officer Sri Muddada Ravi Chandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary, Deputy EO Sri Lokanatham, temple staff and devotees were present during the ceremonies.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ pavitrotsavams









తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

24.8.26

₹17 Lakhs Donation to TTD




Sri Vinod, a resident of Rentapalla village in Palnadu district, donated Rs.17 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Sunday.

The donor handed over the donation DD to Srivari Temple Dy EO Sri Lokanatham at the Ranganayakula Mandapam in the temple.

TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao participated in the programme.

Pavitrotsavams Commences






The annual Pavitrotsavams commenced on a grand religious note in Tirumala on Sunday.

As a part of the three day fete, on the first day, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi.

In the Kalyanotsava Mandapam, the Utsava deities were offered celestial baths with sacred and aromatic ingredients amidst the chanting of vedic hymns by the Veda Pundits in a befitting manner.

On the first day, Pavitra Pratista is carried out by the priests as per Vaikhanasa Agama.

Both the Tirumala Pontiffs, TTD EO Sri Muddada Ravi Chandra, Additional EO Sri Ch.Venkaiah Chowdary, TTD Board member Sri Nannapaneni Sada siva rao, Temple DyEO Sri Lokanatham, and other staff, devotees were also present.

టీటీడీకి రూ.17 లక్షలు విరాళం donation




పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామానికి చెందిన శ్రీ వినోద్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీ అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

23.8.26

శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ankurarpanam




శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.