ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ దీపాలంకరణలు, రంగవల్లులతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రతిరోజూ దివ్య వాహనసేవల్లో స్వామివారి దర్శన భాగ్యం
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీ సౌమ్యనాథ స్వామివారు వివిధ దివ్య వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య మంగళదర్శనం ప్రసాదించనున్నారు.
వాహనసేవలవిశేషాలు
• జూలై 22: ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – యాలి వాహనం
• జూలై 23: ఉదయం – పల్లకీ సేవ, రాత్రి – హంస వాహనం
• జూలై 24: ఉదయం – పల్లకీ సేవ, రాత్రి – సింహ వాహనం
• జూలై 25: ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – హనుమంత వాహనం
• జూలై 26: ఉదయం – శేష వాహనం, రాత్రి – గరుడ వాహనం
• జూలై 27: ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
• జూలై 28: ఉదయం 10 గంటలకు – ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి – గజ వాహనం
• జూలై 29: ఉదయం 9 గంటలకు – రథోత్సవం, రాత్రి – అశ్వ వాహనం
• జూలై 30: ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం
• జూలై 31: సాయంత్రం 6 గంటలకు – పుష్పయాగం
జూలై 28నఆర్జితకల్యాణోత్సవం
జూలై 28న ఉదయం 10 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో గృహస్థ దంపతులు రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే ప్రతి దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదాలను టీటీడీ బహుమతిగా అందజేస్తుంది.
ప్రతిరోజూభక్తిసంగీతం – హరికథలు – సంకీర్తనలసందడి
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీతం, హరికథలు, సంకీర్తనలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.
ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ క్షేమతలిగ నివేదన అనంతరం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. దుష్టశిక్షణకు ప్రతీకగా స్వామివారు మూడుసార్లు బళ్లెంను ప్రయోగించే విశిష్ట ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆస్థానం నిర్వహించారు. తరువాత సాయంత్రం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.
అన్నమయ్యసంకీర్తనలు – భజనలు - అన్నప్రసాదాలపంపిణీ
పార్వేట ఉత్సవం సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భజన బృందాలు భజనలు, కోలాటాలతో భక్తులను అలరించగా, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవో డా.ఎ.శరత్, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాధ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధనశేఖర్‌జయ, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The annual Sri Soumyanatha Swamy Brahmotsavams at the ancient temple in Nandalur, Kadapa district, will begin with Ankurarpanam at 6 p.m. on July 21, followed by Dwajarohanam on the morning of July 22.
During the nine-day festival, the deity will bless devotees on different Vahana Sevas every day at 8 a.m. and 7 p.m. Special events include Arjita Kalyanotsavam on July 28, Rathotsavam on July 29, Chakrasnanam and Dhwajavarohanam on July 30, and Pushpayagam on July 31.
TTD has made elaborate arrangements, including drinking water, shelters, illumination, and decorations for devotees. Devotional music, Harikathas, Sankirtans, and cultural programmes will be organised daily by the Hindu Dharma Prachara Parishad, Annamacharya Project, and Dasa Sahitya Project.
Commemorating the birth star of the erstwhile Maharaja of Mysore, TTD will observe the annual Pallavotsavam festival at Tirumala on July 22.
After the Sahasra Deepa Alankara Seva, Sri Devi and Bhu Devi together with Sri Malayappa Swamy will be taken on a ceremonial procession to the Karnataka Choultries. The
representatives of the Government of Karnataka and the Mysore royal family offer special Harathi on the occasion.
This festival has been observed for the past 300 years in memory of the Maharaja of Mysore.
The Mysore Maharaja instituted the daily tradition of offering Navaneetha Harathi and donating five kilograms of ghee each day to the Brahma Deepa and the Maharaja Deepa before the Suprabhatam. This practice continues to the present day.
His Holiness Sri Sri Varaha Mahadesikan (Andavan), Chief Pontiff of Srirangam Srimath Andavan Ashramam, offered prayers in Tirumala temple on Sunday.
He was received at the Sacred Fig tree located near Old Annaprasadam Complex as per temple traditional honours (Pedda Maryada). Later TTD EO Sri Muddda Ravi Chandra, Addl EO Sri Ch. Venkaiah Chowdary welcomed the seer, while the archakas took the Pontiff to Bedi Anjaneya Swamy temple with Isthikapal honours.
TTD Board Member Sri Bhanuprakash Reddy, Temple DyEO Sri Lokanadham, Temple Peishkar Sri Ramakrishna and others were present.
ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేష అభిషేకాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవను తిలకించారు.
సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన గరుడ వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గరుడునిపై విహరించిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తూ ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక పరవశంతో నింపారు.
జూలై 20నపార్వేటఉత్సవం
సాక్షాత్కార వైభవోత్సవాల అనంతరం జూలై 20న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునికుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.