4.8.26

కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం : తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు • శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తు 72వ జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభం tirupati mla







తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు తెలిపారు.


తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తు 72 జాతీయ నాటకోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.


సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కళాకారులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం, టీటీడీ నిరంతరం కట్టుబడి ఉన్నాయని తెలిపారు. పౌరాణిక, సాంఘిక నాటకాలు, ఏకపాత్రాభినయం, లలిత సంగీత పోటీల నిర్వహణ అభినందనీయమన్నారు. గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన నాటకోత్సవాలను ఏడాది టీటీడీ అందించిన రూ.25 లక్షల ఆర్థిక సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ కళలకు, కళాకారులకు టీటీడీ ఇదే విధంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు.


ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సుగుణమ్మ మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గరుడ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కళాకారులు నాటకోత్సవాల్లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. గతంలో తిరుపతిలో ప్రతి నెల పౌరాణిక నాటకాలు ప్రదర్శించే సంప్రదాయాన్ని పునరుద్ధరించి, కనీసం నెలకు ఒక పౌరాణిక లేదా ఒక సాంఘిక నాటకాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను కోరారు. పది రోజులపాటు నిర్వహించే నాటకోత్సవాల్లో కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.


టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ, కళలను ఆదరించే సమాజంలోనే సంస్కృతి, సాంప్రదాయాలు, సుఖశాంతులు వర్ధిల్లుతాయని పేర్కొన్నారు. కళాకారులు, కళాపోషకులకు టీటీడీలో సేవ చేసే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారు. కళలను పరిరక్షించి ప్రోత్సహించిన పాలకులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వివరించారు.


టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి. రవి మాట్లాడుతూ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ద్వారా టీటీడీ కళాకారులకు విశేష ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఎస్‌వీ సంగీత, నృత్య కళాశాల, నాదనీరాజనం, ఎస్‌వీబీసీ వంటి వేదికల ద్వారా సంగీత, నాటక, సాంస్కృతిక రంగాలకు మరింత ఊతమిస్తున్నామని తెలిపారు. తిరుపతి, తిరుమలలో ఎస్‌వీబీసీ ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోందని వెల్లడించారు.


కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ గౌరవాధ్యక్షులు శ్రీ చిన్నంగారి రమణ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, కార్యదర్శి శ్రీ మునిరత్నం, నగర ప్రముఖులు శ్రీ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, శ్రీ కుమారస్వామి రెడ్డి, కళాపరిషత్ ప్రతినిధులు, కళాకారులు, కళాభిమానులు, పెద్ద సంఖ్యలో పురప్రజలు పాల్గొన్నారు.

Aadi Krithika Festival at Sri Kapileswara Swamy Vari Temple on 7th August




The Aadi Krithika festival will be celebrated with religious fervour at Sri Kapileswara Swamy Temple, Tirupati, on August 7.

On the occasion, Snapana Tirumanjanam will be performed to the processional deities of Sri Subrahmanya Swamy along with Sri Valli and Sri Devasena from 9.30 am to 10.30 am with milk, curd, honey, sandalwood and other fragrant ingredients.

Later, the Thiruveedhi Utsavam will be held from 6 pm to 8 pm. TTD has appealed to devotees to participate in large numbers and seek the divine blessings of the Lord.

ఆగస్టు 7న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా ఆడికృత్తిక ఉత్సవం aadi krutika festival




తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 7 తేదీన ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి విశేష ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి విశేష పూజలు నిర్వహిస్తారు.

అనంతరం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి తిరువీధి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ అధికారులు కోరారు.

ఆగస్టు 5 నుంచి 14 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవాలు andal tiruvadipuram




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 5 నుండి 14వ తేదీ వరకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.

ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులు అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందనున్నారు.

ఆగస్టు 14న శాత్తుమొర మహోత్సవం

ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆగస్టు 14న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి మహోత్సవ ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక పూజల తర్వాత అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స్‌లోని గీతా మందిరం, ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్‌ మఠం మీదుగా దివ్య ఊరేగింపు ఆలయానికి చేరుకుంటుంది.

రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహించి ఉత్సవాలకు మంగళం పలుకుతారు.

ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు ttd chairman




తిరుపతి జిల్లా నాగలాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు

దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతార స్వరూపుడు శ్రీ వేదనారాయణస్వామి వారికి ప్రత్యేక పూజల్లో పాల్గొని దేశ ప్రజల సుఖశాంతులు, సనాతన ధర్మాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారాం, శ్రీ నరేష్ కూడా చైర్మన్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేదనారాయణస్వామివారి క్షేత్ర మహిమ, ఆధ్యాత్మిక విశిష్టతను చైర్మన్‌కు వివరించారు. అనంతరం ఆలయ అధికారులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను సమర్పించి సత్కరించారు.

3.8.26

Rs. 25 LAKH DONATED TO TTD SV PRANADANA TRUST


Hyderabad-based devotee Smt. Chevuri Ushasri donated Rs. 25 lakh to the TTD SV Pranadana Trust.

She handed over the donation cheque to TTD Chairman Sri B.R. Naidu at the Chairman's Camp Office in Tirumala on Sunday.

Appreciating her generous contribution, the Chairman presented Srivari Theertha Prasadams and a laminated portrait of Lord Sri Venkateswara to the donor.

TTD Board Member Sri Mallela Rajasekhar Goud and the donor's family members were also present on the occasion.

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.25 లక్షల విరాళం donation



టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీమతి చెవూరి షశ్రీ రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు.

తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడును కలిసి ఆమె విరాళం చెక్కును అందించారు.

ఈ సందర్భంగా దాతృత్వం చాటిన శ్రీమతి ఉషశ్రీని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు అభినందించి, ఆమెకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ మల్లెల రాజశేఖర్ గౌడ్, దాత  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.