23.7.26

యాలి వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామి కటాక్షం yali vahanam


నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజైన బుధవారం రాత్రి 7 గంటలకు యాలి వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షించారు

భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Peetadhipathi Of Sri Vyasaramam,Verpedu Offered Prayers in Tirumala







His Holiness Sri Sri Sri Paripoornanandhagiri Swamulavaru, Sri Vyasasramam, Yerpedu offered prayers in the hill temple of Lord Venkateswara on Wednesday.

 He was accorded a traditional welcome amidst the chanting of Veda mantras. TTD Addl EO Sri Venkaiah Chowdary welcomed the pontiff of Sri Vyasasramam.

Temple Peishar Sri Ramakrishna and others were present.

22.7.26

TTD VIGILANCE STAFF RETURNS BAG


TTD Vigilance and Security personnel safely returned a bag containing about 100 grams of gold ornaments that was accidentally left behind by a devotee at the Alipiri Checkpoint on Monday at around 11.35 a.m.

During security screening, the staff found the unattended bag and took it into safe custody. After verifying the contents, they examined CCTV footage and identified the owner as Sri Mahesh from Hyderabad.

The devotee, who was not yet aware that he had forgotten the bag, was immediately contacted. After verifying his identity, the bag was handed over to him safely.

Sri Mahesh thanked the TTD management and appreciated the Vigilance and Security staff for their honesty, alertness, and dedicated service.

జూలై 24 నుంచి 26 వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం jyestabhishekam


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు జూలై 24 నుంచి 26 తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు

ఈ వార్షిక ఉత్సవంలో స్వామివారి స్వర్ణకవచాలను శాస్త్రోక్తంగా తొలగించి, పవిత్రంగా శుద్ధి చేసి తిరిగి అలంకరిస్తారు.

మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు

•  జూలై 24 – కవచాధివాసం

•  జూలై 25 – కవచ ప్రతిష్ఠ

•  జూలై 26 – కవచ సమర్పణ

ప్రతిరోజూ ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడతాయి.

ఆషాఢ మాసంలో వార్షిక వైభవం

ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ జ్యేష్ఠాభిషేకం ద్వారా శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని ఆలయ ఆగమ పండితులు పేర్కొంటున్నారు.

ANKURARPANAM PERFORMED FOR SRI SOUMYANATHA SWAMY BRAHMOTSAVAMS BRAHMOTSAVAMS TO BEGIN WITH DWAJAROHANAM ON JULY 22



The annual Brahmotsavams of the ancient and renowned Sri Soumyanatha Swamy Temple at Nandalur in Kadapa district commenced with the traditional Ankurarpanam ceremony on Tuesday evening.

The rituals began in the morning with Suprabhata Seva, Thomala Seva, and Sahasranamarchana. In the evening, Veda Parayanam, Senadhipati Utsavam, Medini Puja, Mrutsangrahanam, and Ankurarpanam were performed as per Agama traditions, marking the formal commencement of the festivities.

Dwajarohanam on July 22

The Brahmotsavams will officially begin with Dwajarohanam on Wednesday between 7.45 a.m. and 8.15 a.m. Before the flag-hoisting ceremony, Sri Soumyanatha Swamy along with Sridevi and Bhudevi, Dhwajapatam, and Chakrathalwar will be taken in a sacred procession from 6.00 a.m. to 7.30 a.m.

Temple of Wish Fulfilment

Sri Soumyanatha Swamy is revered as the fulfiller of devotees' wishes. It is believed that performing nine pradakshinams around the sanctum fulfills one's prayers, while devotees traditionally perform 108 pradakshinams after their wishes are fulfilled.

A Temple with Rich Heritage

Built in the 11th century, the temple was renovated during the rule of the Pandya, Kakatiya, and Vijayanagara dynasties. It houses inscriptions dating from the 10th to the 17th century and has two sacred temple tanks, one inside and another outside the temple premises.

Saint-poet Tallapaka Annamacharya composed 16 Sankirtanas in praise of Sri Soumyanatha Swamy. The temple is also known for its unique pillars adorned with lion sculptures, giving rise to the local belief that another temple exists beneath the present structure.

Temple Deputy EO Smt. Prashanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, priests, Srivari Sevaks, and other officials participated in the ceremony.

శాస్త్రోక్తంగా శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జూలై 22న ధ్వజారోహణంతో వైభవంగా బ్రహ్మోత్సవాల ఆరంభం ankurarpanam



కడప జిల్లా నందలూరులోని ప్రాచీన, ప్రసిద్ధి గాంచిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా మేదినీపూజ, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘనంగా నిర్వహించారు.

ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేదప్రబంధ శాత్తుమొర జరగగా, ఆపై సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణను ఆగమోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

జూలై 22 ధ్వజారోహణం

బుధవారం ఉదయం 7.45 గంటల నుండి 8.15 గంటల వరకు ధ్వజారోహణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారుల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది.

కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం శ్రీ సౌమ్యనాథుడు

శ్రీ సౌమ్యనాథ స్వామివారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడిగా విశేష ఖ్యాతి పొందారు. గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే మనోరథాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కోరికలు నెరవేరిన అనంతరం 108 ప్రదక్షిణలు చేయడం ఈ క్షేత్ర విశిష్ట సంప్రదాయంగా కొనసాగుతోంది.

వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన దివ్యక్షేత్రం

11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం పాండ్యులు, కాకతీయులు, విజయనగర రాజుల పరిరక్షణలో పునర్నిర్మాణం పొందింది. ఆలయ గోడలపై 10వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు చెందిన శాసనాలు చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. ఆలయ ప్రాంగణంలో ఒకటి, వెలుపల మరొకటి ఇలా రెండు పవిత్ర కోనేరులు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

మహాకవి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ సౌమ్యనాథ స్వామివారిని కీర్తిస్తూ 16 సంకీర్తనలు రచించారు. అలాగే ఆలయ మండపంలోని స్తంభాలపై సింహాల శిల్పాలు ప్రత్యేక శైలిలో చెక్కబడి ఉండడం ఈ ఆలయ విశిష్టత. ఈ కారణంగానే ఆలయం క్రింద మరో ఆలయం ఉందని స్థానికులు విశ్వసిస్తుంటారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, అధికారులు పాల్గొన్నారు.