18.8.26

తిరుమలలో గదుల దళారీ ముఠా గుట్టురట్టు broker gang

తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో వేరొకరి పేర్లతో గదులు పొంది వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠా ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం భగ్నం చేసింది.

ఆగస్టు 16న అప్పటికే ఒక గది పొందిన వ్యక్తి మరో గుర్తింపుతో తిరిగి గది కోసం క్యూలో నిలబడటాన్ని సీఆర్వో కార్యాలయం సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని కేరళ మలప్పురం జిల్లాకు చెందిన ఆషిక్ అలీ పి.ఎం. (32)గా గుర్తించారు. అతని వద్ద రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

రంజిత్ అనే దళారి ఒక్కో గదికి రూ.1,000 చొప్పున ఇస్తామని తనను నియమించుకున్నట్లు ఆషిక్ విచారణలో వెల్లడించాడు. నకిలీ గుర్తింపు పత్రాలతో గదులు పొందడం, వాటిని దళారికి అప్పగించడం తన పని అని, ఆ గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపాడు. ముఠాలోని ఇతర సభ్యులపై విచారణ కొనసాగుతోంది.

విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై నమోదు చేయడం జరిగింది. నకిలీ ఆధార్ కార్డుల ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు, సాంకేతిక ఆధారంగా ముఠా వ్యవహారాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలలో వసతి భక్తుల కోసం మాత్రమేనని, దళారుల ద్వారా గదులు కొనుగోలు చేయకూడదని,  ఆధార్, ఫొటోలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలను అపరిచితులకు ఇవ్వకూడదని, అదేవిధంగా వసతిని సీఆర్వో కౌంటర్లు, టీటీడీ అధికారిక వెబ్‌సైట్, అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

ఎవరైనా దళారి డబ్బు తీసుకుని గది ఇప్పిస్తానని సంప్రదించినా లేదా అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే టీటీడీ విజిలెన్స్ & సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నెం: 9866898630 లేదా టీటీడీ కాల్ సెంటర్ నెం : 155257 కు సమాచారం ఇవ్వాలని భక్తులను కోరడమైనది.

భక్తులను మోసగించే దళారులు, వారికి సహకరించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

శ్రీవారి పుష్కరిణీలో అదనపు ఈవో తనిఖీలు pushkarini

సెప్టెంబర్ 15 నుండి 23 తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణీ మరమ్మతు పనులను సోమవారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పుష్కరిణీలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పుష్కరిణీ లోతు తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఈ తనిఖీల్లో ఎస్ఈ శ్రీ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, ఈఈలు శ్రీ సుధాకర్, శ్రీ శ్రీనివాసరావు, డిఈ శ్రీ చంద్ర శేఖర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ADDITIONAL EO INSPECTS SRIVARI PUSHKARINI

In view of the Srivari Salakatla Brahmotsavams scheduled to be held from September 15 to 23, TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary inspected the ongoing repair works at Srivari Pushkarini on Monday.

During the inspection, he instructed the officials to install grills at appropriate locations to ensure the safety and convenience of devotees. 

He also directed them to install signboards indicating the depth of the Pushkarini at suitable locations.

SE Sri Venugopal, Dy EO Sri Bhaskar, EEs Sri Sudhakar and Sri Srinivasa Rao, DE Sri Chandra Sekhar, VGO Sri Surendra and other officials participated in the inspection.

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ valmikipuram

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు సోమవారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆగస్టు 18న ఉదయం యాగశాల పూజ, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

ఆగస్టు 19న ఉదయం యాగశాల పూజ, 6.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ, రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గృహస్తులు (ఇద్దరు)  రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేక ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ పట్టాభిరామస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఏఈవో శ్రీ గోపినాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు ఇతర అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Karishthi Yagam from 30th Aug to 03rd Sep

Seeking the divine intervention for a good amount of rain in State as well across the country, TTD  will conduct Karishthi Yagam, Varuna Japam and Parjanya Shanti Homam from August 30 to September 03, in Tirumala.

The rituals will be performed at the Dharmagiri Veda Vignana Peetham and the arrangements for the ritual are being made under the supervision of the Principal Sri Kuppa Siva Subrahmanya Avadhani.

As many as 32 Vedic, Shrauta and Smartha scholars will participate in the Yagam and related rituals. The Maha Purnahuti will be performed on September 03.

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ pattabhishekam

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు సోమవారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆగస్టు 18న ఉదయం యాగశాల పూజ, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

ఆగస్టు 19న ఉదయం యాగశాల పూజ, 6.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ, రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గృహస్తులు (ఇద్దరు)  రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేక ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ పట్టాభిరామస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఏఈవో శ్రీ గోపినాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు ఇతర అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఆగ‌స్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేది వ‌ర‌కు కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమం shanti homam

రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ ఆగ‌స్టు 30 నుండి సెప్టెంబర్ 3 తేదీ వ‌ర‌కు కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాల‌ను టీటీడీ నిర్వ‌హించ‌నుంది.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. 32 మంది వేద‌, శ్రౌత‌, స్మార్థ‌పండితులు యాగ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 3న మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞ‌న పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.