టిటిడి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగష్టు 16వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
గోకుల నందనుడు, బృందావన విహారి, ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన టిటిడి హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనుంది.
సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టిటిడి శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూమాలలతో అలంకారాలు చేపట్టనుంది. గోశాలలోని గోసంపదను అందంగా అలంకరించి భూలోక గోకులంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముత్యాల రంగవల్లికలతో తీర్చిదిద్దుతున్నారు.
గోశాలకు విచ్చేసే భక్తులు గోశాలలో బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. హైందవ ధర్మంలో గోవును ”గోమాత”గా వ్యవహరిస్తూ అత్యంత ఉత్కృష్టమైన స్థానంలో నిలిపి ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవును కొలుస్తారు. అటువంటి గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల భావన, నమ్మకం. కావున టిటిడి సందర్శకులకు గోశాలలోని గోవులకు గ్రాసాన్ని అందించి గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5 నుండి 10.30 గంటల వేణుగానం, తిరుమల వేదపాఠశాల విద్యార్థులచే వేదపారాయణం, టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ సిల్వర్ కోటెడ్ రాగి రేకులు ఆగష్టు 21వ తేదీలలో టెండర్ కమ్ వేలం (ఆఫ్లైన్) వేయనున్నారు.
ఇందులో కాపర్ (3000కేజిలు) -15 లాట్లు ఆగష్టు 21న వేలానికి ఉంచారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org సంప్రదించగలరు.
అన్ని ఆగమాలకు మూలం వైఖనసాగమేనని శ్రీ విఖనస మహర్షి జయంతి సభలో పండితులు ఉద్ఘాటించారు. తిరుమలలో శనివారం శ్రీ విఖనస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆస్థాన మండపంలో టీటీడీ అళ్వార్ దివ్య ప్రభంద ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్దాంత వివర్ధని సభ సంయుక్త ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ దీవి రాఘవ దీక్షితులు ప్రసంగిస్తూ విఖనస మహర్షి రచించిన శ్రీ వైఖానస కల్పసూత్రమ్ లో 18 సంస్కారాలు, 22 యజ్ఞాలు, ధర్మాలు, ప్రాయశ్చిత్తాలు ఉపదేశించబడ్డాయని తెలిపారు.
శ్రీ వైఖనస కల్పసూత్రమ్ ద్వారా ఆవిర్భవించిందే వైఖానస ఆగమమని, తిరుమల శ్రీనివాసునికి వైఖనస ఆగమం ప్రకారమే అర్చనాదులు జరపబడుతున్నాయని వక్తలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ దీవి శ్రీనివాస దీక్షితులు, ప్రొఫెసర్ వేదాన్తం శ్రీ విష్ణుభట్టాచార్యులు, శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
Sravana Upakarma was observed with religious fervour in Sri Govindaraja Swamy temple on Saturday in connection with the auspicious occasion of Sravana Pournami.
Both the Utsava deities of Sri Govindaraja Swamy and Sri Krishna Swamy were taken to Alwarthirtham in Kapila Theertham temple and were offered Snapana Tirumanjanam followed by Homan and Asthanam.
Later the deities returned to the Sri Govindaraja Swamy temple.
Both the Pontiffs of Tirumala temple, Temple officials, priests and devotees were present.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, హోమం, ఆస్థానం నిర్వహించారు.
సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహించి, అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈఓ శ్రీ ఏవీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
The Aadi Krithika festival will be celebrated at the Sri Kapileswara Swamy Temple in Tirupati on August 16.
As part of the festivities, Snapana Tirumanjanam will be performed to the Utsava Murthies of Sri Valli Devasena Sametha Subramanya Swamy from 9:30 a.m. to 10:30 a.m., with a special abhishekam using milk, curd, honey, sandal paste, and other fragrant ingredients.
In the evening, from 6 p.m. to 8 p.m., a Tiruveedhi Utsavam will be conducted, wherein the processional deities of Sri Valli Devasena Sametha Subrahmanya Swamy will be taken in a procession around the temple streets.
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది.
ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.